prithvi missile: పృధ్వి -2 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం సక్సెస్


భారత్ మరోసారి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. భూ ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైన మధ్య కాలిక లక్ష్యాలను ఛేదించే పృధ్వి -2 బాలిస్టిక్ మిసైల్ క్షిపణిని ఈ రోజు ఒడిసాలోని చాందీపూర్ లో గల ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఉదయం 10.56 గంటలకు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టు ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ ప్రకటించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత్ డైనమిక్స్ సంస్థల సంయుక్త పరిశోధనే పృధ్వి -2 బాలిస్టిక్ మిసైల్. దీన్ని తొలిసారిగా 1996 జనవరి 27న ప్రయోగించారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మధ్య మధ్యలో ఇటువంటి పరీక్షలు జరుపుతుండడం పరిపాటి. 4,600 కిలోగ్రాముల బరువుండే ఈ క్షిపణి వెయ్యి కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకుపోగలదు. 8.56 మీటర్ల పొడవు ఉంటుంది.

  • Loading...

More Telugu News