shooting world cup: షూటింగ్ ప్రపంచకప్ లో భారత్ కు స్వర్ణం


దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్ లో భారత షూటర్లు స్వర్ణాలు సాధించారు. భారత ఏస్ షూటర్లు హీనా సిద్ధు, జీతూరాయ్ 10 మీటర్ల మిక్స్ డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో జపాన్ షూటర్లను ఓడించి.. తొలి స్థానంలో నిలిచారు. షూటింగ్ ప్రపంచ కప్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగం పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 లో జపాన్ లోని టోక్యోలో నిర్వహించనున్న ఒలింపిక్స్ లో జరిగే షూటింగ్ పోటీల్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగాన్ని ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగానే ప్రస్తుత ప్రపంచ కప్ లో ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇది సన్నాహక పోటీయే కావడంతో విజేతలకు పతకాలు అందజేయడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. 

shooting world cup
india
gold medal
  • Loading...

More Telugu News