demonitisation: ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్‌ల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో హెచ్‌డీఎఫ్‌సీ ఛార్జీల మోత!


ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జం హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్‌ల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో సేవింగ్స్ ఖాతా నగదు లావాదేవీలపై భారీగా ఛార్జీలను పెంచేసింది. ఈ నిర్ణ‌యం వ‌చ్చేనెల 1నుంచే అమ‌లులోకి వస్తుందని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రూ.50,000 థర్డ్‌పార్టీ ట్రాన్సాక్షన్స్ ప‌రిమితిని ఇక‌పై రూ.25 వేలకు కుదించనున్న‌ట్లు తెలిపింది. ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకునే ప‌రిమితి కూడా అయిదు నుంచి నాలుగుకి తగ్గించింది. ఇక ప‌రిమితి మించి నాన్-ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకునేవారిపై చార్జీల‌ను పెంచుతున్న‌ట్లు తెలిపింది.

అలాగే హోం బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్  పై  కూడా లిమిట్‌ల‌ను విధించింది. విత్ డ్రా తో పాటు డిపాజిట్స్ ను ఇకపైన  రూ.2 లక్షల వరకే పరిమితం చేస్తున్న‌ట్లు, లిమిట్ దాటి చేయాల‌నుకునేవారు కనీస చార్జీ రూ.150 ఫీజుగాను, లేదా  వెయ్యికి రూ.5 లు గానీ చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆ బ్యాంకు తెలిపింది. థర్డ్ పార్టీ లావాదేవీలపై కూడా ఇదే విధంగా చార్జీల మోత మోగిస్తున్న‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News