bheem: రిఫరల్ బోనస్, క్యాష్‌బ్యాక్.. భీమ్ యాప్ యూజర్లకు అరుణ్ జైట్లీ శుభవార్త!
దేశంలో నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపుకు మళ్లించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమ్ యాప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లను సంపాదించుకున్న ఈ యాప్ వినియోగదారులను మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రెండు పథకాలను ప్రకటించారు. భీమ్ యాప్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రిఫరల్ బోనస్, క్యాష్‌బ్యాక్ పథకాలను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం డిజిటల్ ఆర్థికవ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తుందని, దీంతో సామాన్యుడికి ఎన్నో లాభాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భీమ్ యాప్‌ను కోటీ 25లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆయన అన్నారు.