GodavariUS: హెర్న్ డన్ ప్రాంతంలో ఇప్పుడు మీ అభిమాన గోదావరి దక్షిణ భారత రుచుల రెస్టారంట్


ప్రెస్ నోట్: అమెరికాలో భారతీయులను దక్షిణ భారత రుచులతో అలరిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో వేగంగా విస్తరిస్తున్న గోదావరి రెస్టారంట్ గ్రూప్ ఇప్పుడు గ్రేటర్ వాషింటన్ ప్రాంతంలోని తమ రెండవ రెస్టారెంటుని హెర్న్ డన్ లో జనవరి 28 నఆరంభించనుంది. ఇప్పటికే మేరీలాండ్లోని మొదటి రెస్టారంట్ ఎంతో ఆదరణ పొందుతూ భారతీయుల, ఇతర భోజన ప్రియుల మన్ననలు సంపాదిస్తోంది.
 
గోదావరి రెస్టారంట్ గ్రేటర్ వాషింగ్టన్ ప్రాంతంలో ఇది రెండవ రెస్టారంట్.
 
గోదావరి హెర్న్ డన్ కార్పొరేట్ కంపెనీలు ఉండే ప్రాంతానికి దగ్గరగా భారతీయులు నివాసముండే ప్రాంతాలకు చేరువలో ఉంది. ప్రసిద్ధి చెందిన వరల్డ్ గేట్ సెంటర్ (World Gate Center) కూడా కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది.
 
తమ ఇతర రెస్టారెంట్లలో , గోదావరి గ్రూపుకే సొంతమైన ప్రసిద్ధి చెందిన వంటకాలు కాకుండా గణతంత్ర దినోత్సవ థీమ్ తో బఫెట్ విందులు వడ్డించబడతాయి. అలాగే ఈ లంచ్ మన దేశానికి వన్నె తెచ్చిన సూపర్ హీరోస్ కి అంకితంఇవ్వబడుతుంది. మహాత్మా ములక్కాయ బజ్జి, బోస్ బోండా కబాబ్, సరోజినీ గోంగూర మాంసం, పటేల్ పుట్టగొడుగుల పులావు, రాయలసీమ రాగి సంకటి, ఆల్వాల్ పాయ సూప్ మరియు అనేక రుచులు ఉంటాయి. అలాగే వాతావరణంఅనుకూలిస్తే అప్పటికప్పుడు తయారు చేసి వడ్డించే గోదావరి బండి మీద దోస, పానీపూరి వంటి పేరొందిన ఆకర్షణలు కూడా భోజన ప్రియులకు అందుబాటులో ఉంటాయి.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి మేరీల్యాండ్ మరియు హెర్న్ డన్ యజమాని కామాక్షి తుమ్మలపల్లి ప్రారంభం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, గోదావరి చైన్లో భాగంగా ఉంటూ రెండవ రెస్టారెంటు హెర్న్ డన్లో ప్రారంభించడం చాలాగర్వకారణంగా ఉందని అన్నారు. "భారత దేశీయులకు ఇంటి రుచులు అందించటం చాల సంతృప్తి కరంగా కూడా ఉంటుంది," అంటూ మేరీల్యాండ్ లోని రెస్టారెంటు మాదిరిగా ఈ కొత్త రెస్టారెంటు కూడా విశేష ఆదరణ పొందుతుందిఅని ఆశాభావం వ్యక్తం చేసారు.
 
గోదావరి చైన్ అద్భుతంగా విస్తరిస్తూ ఉండటం అంటే యావత్ ప్రపంచానికి దక్షిణ భారత రుచులు అందచేయటంతో సమానమే. ఒక జట్టులా కలసికట్టుగా, నాణ్యమైన, రుచుకరమైన ఇంటి వంటలు, ఊరి వంటలు అందించటం మాఅదృష్టం, అని అన్నారు గోదావరి డెలావేర్ యజమానులు గోపి చిగురుపాటి మరియు మోహన్ తుమ్మల.
 
“గోదావ‌రి”  ఫ్రేమింగ్ హామ్ గ్రాండ్ ఓపెనింగ్  ట్రైల‌ర్ :
రాజసంతో కూడిన రుచికరమైన గోదావరి లంచ్ విందుకి ఇదే సమయం
 
చిరునామా:
గోదావరి హెర్న్ డన్
1050, ఎల్డెన్ స్ట్రీట్
హెర్న్ డన్, వీఏ 20170
 
సంప్రదించండి:
కామాక్షి తుమ్మలపల్లి
443-825-7492
Herndon@GodavariUS.com
www.GodavariUS.com
 
Press note released by: Indian Clicks, LLC

GodavariUS
  • Error fetching data: Network response was not ok

More Telugu News