Ravi Shankar PrasadVerified account: దేశంలో ఇప్పటి వరకు ఆధార్‌ ద్వారా 167.3 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్


దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించిన భీమ్ యాప్‌పై కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ రోజు ఢిల్లీలో మాట్లాడారు. ఆ యాప్‌ను ఆధార్‌కు అనుసంధానిస్తున్నామని, ఇప్పటి వరకు 4.47 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు అనుసంధానం చేశామ‌ని తెలిపారు. మ‌రో నెల రోజుల్లో మరో 2 కోట్ల ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లు ఆధార్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు ఆధార్‌ ద్వారా 167.3 కోట్ల మేర చెల్లింపులు జరిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఇక దేశంలో 111 కోట్ల మంది ఆధార్ కార్డు పొందార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం వల్ల స‌ర్కారు పథకాలకు చెందిన రూ.36వేల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.

Ravi Shankar PrasadVerified account
  • Loading...

More Telugu News