trump: మెక్సికో దిగుమతులపై పన్ను విధించాలని ట్రంప్‌ ప్రతిపాదన.. భారత్ పైనా ప్రభావం పడే అవకాశం


అమెరికా, మెక్సికో దేశాల‌ నడుమ గోడ నిర్మాణానికి రంగం సిద్ధం చేసిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ దేశం నుంచి త‌మ దేశానికి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 20శాతం పన్ను విధించాలని ప్ర‌తిపాద‌న చేశారు. ఇరు దేశాల మ‌ధ్య‌ గోడ నిర్మాణానికి తాము ఒక్క డాల‌ర్‌ కూడా ఇవ్వ‌బోమ‌ని మెక్సికో అధ్య‌క్షుడు ఇటీవ‌లే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఆ గోడ నిర్మాణానికి మెక్సికో నుంచి డబ్బు రాబట్టడానికి ట్రంప్ ఈ ఉపాయం చేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ అంశంపై స్పందించిన‌ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్ మాట్లాడుతూ... ట్రంప్ చేసిన ఈ పన్నుల ప్రతిపాదన ప్రభావం భారత్‌, చైనా వంటి దేశాల దిగుమతులపైనా పడే అవకాశముందని అన్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రతిపాదన మెక్సికోకి మాత్రమేనని, ఈ ప్రతిపాదనలు తొలిదశలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యల‌ను మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో ఖండించారు.

  • Loading...

More Telugu News