trump: ప్ర‌మాణ స్వీకారం చేసే సమయంలో తన భార్యను కసురుకున్న ట్రంప్.. వైరల్ గా మారుతున్న వీడియో!


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దానికి కార‌ణం ఈ స‌మయంలో ట్రంప్‌ భార్య కన‌ప‌రిచిన‌ హావ‌భావాలే. ట్రంప్ భార్య మెలానియా ఒక ఫొటోలో చిరున‌వ్వులు చిందిస్తూ క‌న‌ప‌డ‌గా, మ‌రో ఫొటోలో విచారంగా క‌నిపించారు. ఆ స‌మ‌యంలో త‌న భార్య‌ మెలానియాను ట్రంప్‌ వెన‌క్కి తిరిగి ఏదో అన‌డం కార‌ణంగానే, ఆమె మొహంలో భావాలు మారిపోయాయని తెలుస్తోంది. ట్రంప్ నుంచి మెలానియాకు విముక్తి క‌ల్పించండి అంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ట్రంప్‌కు వ్య‌తిరేకంగా ఆ దేశంలో ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్న వేళ ఇటువంటి ఫొటో మ‌రోసారి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెలానియాపై నెటిజ‌న్లు సానుభూతి చూపిస్తూ ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మ‌ర్వ్ వీన్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోనే 65 వేల‌కుపైగా లైక్స్‌, 50 వేల‌కుపైగా రీట్వీట్స్ వ‌చ్చాయి.
<blockquote class="twitter-video" data-lang="en-gb"><p lang="und" dir="ltr"><a href="https://t.co/IDrGPkJQSl">pic.twitter.com/IDrGPkJQSl</a></p>— Marv (@Marv_Vien) <a href="https://twitter.com/Marv_Vien/status/823621167621619713">23 January 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  • Loading...

More Telugu News