special status: చంద్రబాబు నాయుడి వల్ల అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది: న‌టుడు సంపూర్ణేష్ బాబు


విశాఖప‌ట్నంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ యువత తలపెట్టిన మౌన ప్రదర్శనకు మద్దతునిస్తూ అక్క‌డ‌కు వెళ్లిన సినీన‌టుడు సంపూర్ణేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి వల్ల రాష్ట్ర అభివృద్ధి సాధ్య‌మ‌వుతుందని ఆయ‌న అన్నారు. ప్రపంచం మొత్తం గొప్ప‌గా చెప్పుకునే అభివృద్ధి ఏపీలో జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆ దిశ‌గా వేగంగా ప‌నులు జ‌రుగుతాయ‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడి నాయ‌క‌త్వంలో ఆ అభివృద్ధి అవ్వాల‌ని తాను మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News