jallikattu: జల్లికట్టు రచ్చ: రాళ్లు, కర్రలతో విరుచుకుపడుతూ మంత్రిని తరిమేసిన తమిళ యువత!
జల్లికట్టు ఉద్యమం నేపథ్యంలో తమిళనాడులోని చెన్నయ్, మధురై లతో పాటు పలు చోట్ల ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ఆ రాష్ట్ర మంత్రి వేలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి అక్కడకు చేరుకోగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చర్చలకు వచ్చిన వారిని చూసిన ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. వెనుకకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తూ వేలుమణి, పోలీసు కమిషనర్ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.