trump: ఇక అణు ఒప్పందంపై చర్చిద్దాం రండి: ఇరాన్ ప్రధానికి డొనాల్డ్ ట్రంప్‌ ఫోన్


ఇటీవ‌లే అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం అంశాన్ని పునఃసమీక్షించే దిశ‌గా క‌దులుతున్నారు. కొన్ని నెల‌ల క్రితం అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నికల సమయంలో ఈ అణు ఒప్పందంపై ఆయ‌న‌ అసంతృప్తి వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇరాన్‌తో న్యూక్లియర్‌ డీల్‌పై చర్చలకు రావాల‌ని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహూను ఆయ‌న చర్చలకు పిలిచారు. ఫిబ్ర‌వరిలోనే ఇరాన్ ప్ర‌ధానితో ట్రంప్ భేటీ అవుతార‌ని ప్రీమియర్స్‌ ఆఫీసు వర్గాలు పేర్కొన్నాయి.
 
ఈ నేప‌థ్యంలో బెంజిమన్‌ నెతన్యాహూకు ఫోన్ చేసిన ట్రంప్ ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్‌కు రావాల‌ని కోరారు. స్థానిక అంశాలపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేసే అంశంపైన,  శాంతి, భద్రతాంశాలపైన వీరిరువురూ మాట్లాడుకున్నారు. అయితే, అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరుసలేం తరలించాలని డొనాల్డ్‌ ట్రంప్ కోర‌గా దానికి ఆ దేశం నుంచి మాత్రం స్పంద‌న లేదు.

  • Loading...

More Telugu News