kohli: మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ వెయ్యి పరుగుల్ని వేగంగా సాధించిన వన్డే కెప్టెన్గా మరో రికార్డును నెలకొల్పాడు. కేవలం 17 ఇన్నింగ్సులోనే కోహ్లీ కెప్టెన్‌గా వెయ్యి పరుగుల్ని సాధించాడు. దీంతో ఇప్పటివరకు నంబర్ 1గా ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ 2వ స్థానానికి పడిపోయాడు. ఏబీ డివిలియర్స్ వన్డే కెప్టెన్ గా 18 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగుల్ని సాధించాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ ధోనీ గైర్హాజరీ అయిన 14 వన్డేలకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ధోనీ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పడంతో ప్రస్తుతం కోహ్లీ పూర్తిస్తాయి వన్డే కెప్టెన్ గా ఉన్నాడు. ఇక, ఈ జాబితాలో ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (20 ఇన్నింగ్స్ ల్లో), ఇంగ్లండ్ క్రికెటర్ అలెస్టర్ కుక్ (21 ఇన్నింగ్స్ ల్లో), టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (22 ఇన్నింగ్స్ ల్లో) ఉన్నారు.