china: చైనా నావికాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక.. విమానాలు, నౌకలపై దాడిచేసే సామర్థ్యం దీని సొంతం
రక్షణ రంగ విభాగంలో ఇప్పటికే ఎన్నో యుద్ధనౌకలను తయారు చేసుకున్న చైనా తాజాగా నావికాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధనౌకను రూపొందించుకుంది. 056 రకం కార్వెట్టీ శ్రేణికి చెందిన ఈ యుద్ధనౌకను ఫుజియాన్ ప్రావిన్స్‌లోని నావికా స్థావరానికి అప్పజెప్పారు. సుమారు 52 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ అత్యాధునిక నౌక శత్రువుల రాడారుకు సైతం దొరక్కుండా తప్పించుకునే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అంతేగాక, విమానాలు, నౌకలతో పాటు సబ్‌మెరైన్లపై దాడిచేయగలదు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఇది చేపల వేట పడవలకు రక్షణగా ఉంటుంది.