manmohan singh: ఆ వ‌ర్సిటీల్లో వివాదాల‌ను చూస్తోంటే విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్నారని తెలుస్తోంది: మన్మోహన్‌సింగ్‌


కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ దేశంలోని విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గతేడాది హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌, ఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థుల‌పై కేసులు వంటి వివాదాలను చూస్తే విద్యార్థుల స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని ఆయ‌న వ్యాఖ్యానించారు.

విద్యార్థులు చేస్తోన్న‌ శాంతియుత నిరసన ప్రదర్శనలను అణచివేయడం అప్రజాస్వామిక చ‌ర్యేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు సామాజిక వికాస కేంద్రాలుగా ఉండాల‌ని, విజ్ఞానంతో పాటు స్వేచ్ఛను కల్పించాలని ఆయ‌న అన్నారు. అలా జ‌ర‌గ‌కుండా విద్యార్థుల‌ భావప్రకటన స్వేచ్ఛ ప్రమాదకరంలో పడటం మంచిదికాద‌ని, అకడమిక్‌ ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యం పెరగడం కూడా భావ్యం కాద‌ని అన్నారు. దేశంలోని ప్రతి వ‌ర్సిటీ స్వయంప్రతిపత్తిని కాపాడుకొనే విధంగా ఉండేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషిచేయాలని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News