attacks: 2011 తర్వాత తొలిసారి బీ-2 బాంబర్లను వాడి 80 మంది ఉగ్రవాదులను హతమార్చిన అమెరికా
లిబియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమార్చేందుకు అమెరికా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ దూకుడుగా ముందుకు వెళుతోంది. తాజాగా ఆయుధాలు, సూసైడ్ బెల్టులతో ఉగ్రవాదులు సంచరిస్తున్న రెండు శిబిరాల ప్రదేశాలపై అమెరికాకు చెందిన బీ-2 బాంబర్లతో మిలటరీ దాడి జరిపింది. ఈ దాడిలో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులు యూరోప్‌లో దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని అమెరికా రక్షణ కార్యదర్శి ఆష్ కార్టర్ చెప్పారు. ఈ మిలిటరీ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలను అమెరికా రక్షణశాఖ మీడియా ముందుంచింది. 2011 తర్వాత మళ్లీ ఈ సారి బీ-2 బాంబర్లను వాడినట్లు పేర్కొంది.