Dangal film: భారీ క‌లెక్ష‌న్‌ల‌తో మరో అరుదైన రికార్డు దిశగా ఆమిర్ ‘దంగ‌ల్‌’


బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఈ సినిమాకు నిన్న మ‌రో 4.06 కోట్ల రూపాయల క‌లెక్ష‌న్లు వచ్చాయి. ఇప్ప‌టికే భార‌త్‌లో అత్యధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పిన దంగల్‌ మరో అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి రూ.365.87 కోట్లు వ‌చ్చాయి. ఇక‌ ఈ రోజు కూడా భారీగానే కలెక్షన్లు వ‌స్తాయ‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక 400 కోట్ల రూపాయల మార్క్‌ బిజినెస్‌ను దాటి రికార్డు నెల‌కొల్ప‌డ‌మే త‌రువాయి అని చెబుతున్నారు. దేశంలో 400 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆమిర్ మూవీ నిలిచిపోతుంద‌ని అంటున్నారు.

ఇంతకుముందు భార‌త్‌లో అత్యధిక కలెక్ష‌న్లు రాబ‌ట్టిన‌ సినిమాగా కూడా ఆమిర్ ఖాన్ న‌టించిన సినిమానే ఉంది. పీకే మొద‌టి స్థానంలో, భజరంగీ భాయిజాన్‌ రెండో స్థానాల్లో ఉన్నాయి. వాటిల్లో పీకే 340.8 కోట్లు రాబ‌ట్ట‌గా భజరంగీ భాయిజాన్‌ 320.34 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది. దేశంలో తొలిసారి 300 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమా కూడా ఆమిర్ ఖాన్ సినిమానే కావ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News