modi: జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణాల్లో హాస్యం, వ్యంగ్యం ముఖ్యమైనవి: ప్రధాని మోదీ


దివంగత చో రామస్వామి స్థాపించిన తుగ్లక్‌ పత్రిక 47వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. చెన్న‌య్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ... జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణాల్లో హాస్యం, వ్యంగ్యం ప్ర‌ధాన‌మైన‌వ‌ని, ఒత్తిడిని తొల‌గించ‌డానికి అవి మంచి ఉపశమనాలని చెప్పారు. అవి కోపం, ఇతర ఆయుధాల కంటే శక్తిమ‌ంతమైనవని వ్యాఖ్యానించారు.  చో రామస్వామి మృతి తనకు వ్యక్తిగత నష్టం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కాలంలో హాస్యం, వ్యంగ్యం ఎంతో అవసరమని మోదీ అన్నారు. చో రామస్వామిని త‌న మిత్రుడిగా పేర్కొన్న మోదీ.. ఆయ‌న‌ వ్యంగ్యం, హాస్యంలో నిపుణుడ‌ని చెప్పారు. ఒక రకమైన కార్టూన్ల ద్వారా ఎన్నో మంచి విష‌యాల‌ను చెప్పేవార‌ని అన్నారు. గ‌తంలో చో రామస్వామి తనపై వేసిన ఓ కార్టూన్‌ను కూడా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News