demonitisation: ఆర్‌బీఐ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ విమర్శలు... వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం


పెద్ద‌ నోట్లరద్దు తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వ్యవహారాల్లో కేంద్ర స‌ర్కారు అనవసరంగా జోక్యం చేసుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కి ఒక లేఖ రాసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్లు కూడా కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని కోల్పోతోందని వస్తోన్న విమర్శల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఆర్‌బీఐ గౌరవానికి ఢోకాలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ పేర్కొంది. ఆ బ్యాంకుకు ఉన్న స్వయం ప్రతిపత్తిని, స్వాతంత్ర్యాన్ని తాము గౌరవిస్తున్నామని తేల్చిచెప్పింది. ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప‌లు అంశాల‌పై తాము చట్ట ప్రకారం ఆర్‌బీఐ మధ్య సంప్రదింపులు జరిపిన‌ట్లు తెలిపింది. వీటిని స్వయంప్రతిపత్తి ఉల్లంఘన అని అన‌కూడ‌ద‌ని వివ‌రణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News