nokia 2107: రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న నోకియా.. భారీగా స్మార్ట్‌ఫోన్ల బుకింగ్స్!


చాలా ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ మార్కెట్లోకి వ‌స్తోన్న‌ నోకియాకు వినియోగ‌దారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఫీచ‌ర్ ఫోన్‌ల‌తో గ‌తంలో ఎంతో మంది వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొన్న నోకియా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోన్న విష‌యం తెలిసిందే. నోకియా–6 పేరుతో నోకియా త‌మ తొలి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ చైనాలో ఆవిష్క‌రిస్తూ ఆన్ లైన్ రిటైలర్ జేడీ డాట్ కామ్ ద్వారా విక్ర‌యానికి పెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌ను సొంతం చేసుకునేందుకు కేవ‌లం 24 గంటల్లో 2,50,000 మంది రిజిస్ట్రేష‌న్‌ చేసుకున్నారట‌. దీంతో నోకియా ఫోన్‌ల‌పై మార్కెట్లో ఉన్న న‌మ్మ‌కం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ నెల 19 నుంచి నోకియా–6 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. మొబైల్ కాంగ్రెస్ వరల్డ్(ఎండబ్ల్యూసీ)కి ఒకరోజు ముందు (అంటే వ‌చ్చేనెల‌ 26న) మరిన్ని స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాలని నోకియా బ్రాండ్ లైసెన్సింగ్ హ‌క్కులు పొందిన‌ హెచ్‌ఎండీ ప్ర‌ణాళికలు వేసుకుంటోంది. నోకియా ఫోన్లను ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది.

రూ.16,750 ధ‌ర‌తో మార్కెట్లోకి వ‌స్తోన్న నోకియా 6 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లుగా.. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్ ప్లే, 2.5 డి గొరిల్లా గ్లాస్, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం, డ్యూయల్‌ సిమ్‌, 16 మెగాపిక్సెల్స్ వెనక‌ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ ముందు కెమెరా, డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీ డ్యూయల్‌ యాంప్లిఫయర్స్, ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0 ఓఎస్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్నాయి.

  • Loading...

More Telugu News