supreme court: కోడి పందేలు ఆపే విధంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేం: సుప్రీంకోర్టు
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే కోడిపందేలపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పలువురు వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారంటూ జాతీయ జంతు సంరక్షణ విభాగం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందించింది. ఆ పందేలు ఆపే విధంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో పందెం రాయుళ్లకు ఊరట కలిగింది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి.