anushka: ఫెమినిస్ట్ ప‌దాన్ని కొంద‌రు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: అనుష్కశర్మ


పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలంటూ బాలీవుడ్ లో ఎంతో కాలంగా లింగవివక్షపై చర్చ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఎంతో మంది బాలీవుడ్ న‌టులు స్పందిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ న‌టి అనుష్కశర్మ కూడా తాజాగా ఈ అంశంపై స్పందించింది. ఫెమినిస్ట్‌ అంటే కొంద‌రిలో ఒక అపోహ ఉందని, వాస్త‌వానికి ఆ ప‌దానికి అర్థం స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమని చెప్పింది. కానీ ఫెమినిస్ట్ ప‌దాన్ని కొంద‌రు తప్పుగా అర్థం చేసుకుంటూ వాళ్లను పురుష ద్వేషులుగా చూస్తున్నారని వ్యాఖ్యానించింది.

వాస్త‌వం చెప్పాలంటే ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోందని, అందుకే వాళ్ల హక్కుల కోసం ఫెమినిస్టులు పోరాడుతున్నారని అనుష్క శర్మ పేర్కొంది. త‌న విష‌యానికి వ‌స్తే మాత్రం తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాన‌ని చెబుతోంది. త‌న‌లాగే మిగిలిన మహిళలు కూడా ఇత‌రుల మీద‌ ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపింది. స‌మాజంలో అంద‌రూ కలిసి మెలిసి ఉండాలని, స్త్రీ, పురుషుల్లో ఒకరిని ఎక్కువ చేయ‌కూడ‌ద‌ని త‌న‌ అభిప్రాయాన్ని తెలిపింది.

  • Loading...

More Telugu News