trump: దుమారం రేపుతున్న ఇంటెలిజెన్స్‌ నివేదిక... ర‌ష్యా వ‌ద్ద డొనాల్డ్ ట్రంప్ ర‌హ‌స్యాలు!


రష్యా ఇంటెలిజెన్స్‌ సర్వీసు చేతిలో అమెరికా కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కీలకమైన, వ్యక్తిగత సమాచారం ఉంద‌ని అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఓ నివేదిక క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నివేదిక‌ను అమెరికా ప్ర‌స్తుత‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇంటెలిజెన్స్ అంద‌జేసింది. ఈ అంశంపై ఇంకా రూడీకాలేదని, అయితే, ఈ సమాచారాన్ని త‌మ‌కు అత్యంత నమ్మకస్తులయిన వారే అందజేశారని ఇంటెలిజెన్స్ పేర్కొంది. వీటి ఆధారంగా బాధ్యులకు నోటీసులు కూడా జారీ చేయవచ్చని తెలిపింది. అయితే, దీనిపై ఈ రోజు స్పందించిన డొనాల్డ్‌ ట్రంప్ అవి కల్పిత వార్తలని, మొత్తం రాజకీయమేన‌ని ట్వీట్ చేశారు.
 
మ‌రోవైపు ఈ నివేదిక‌పై ఓ సీనియర్‌ అమెరికా అధికారి స్పందిస్తూ... తాము నివేదికలో కొన్ని విష‌యాలు మాత్ర‌మే చెప్పామని, రష్యా ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇద్దరు నాయకులకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని సేకరించాయ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని దెబ్బతీసే ఉద్దేశంతో కొంత స‌మాచారాన్ని రష్యా ఇటీవ‌ల బ‌య‌ట‌పెట్టింద‌ని తెలిపారు. అమెరికా అధ్య‌క్ష ప‌దవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించాల‌నే ఉద్దేశంతోనే రష్యా నిఘా వర్గాలు ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాయ‌ని చెప్పారు.
 

  • Loading...

More Telugu News