sbi: స్వచ్ఛంద సేవా సంస్థకు ఎస్‌బీఐ విరాళం!


హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.22.23 లక్షల విరాళమిచ్చింది. న‌గ‌రంలోని కౌన్సిల్‌ ఆఫ్‌ హ్యుమన్‌ వెల్ఫేర్‌ (హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ)కు ఈ విరాళం అందించి మొబైల్‌ క్లినిక్‌ ఏర్పాటు చేయాల‌ని సూచించింది. ఈ క్లినిక్ ద్వారా నిరుపేద కుటుంబాలకు వైద్యం అందించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఆ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజ్నిష్‌ కుమార్‌ ఆ స్వ‌చ్ఛంద సంస్థ‌ డైరెక్టర్‌ మహ్మద్‌ రఫీయుద్దీన్‌కు అందజేశారు. ఈ క్లినిక్ ద్వారా వచ్చే వారం నుంచే స‌ర్వీసు అందుబాటులోకి వ‌స్తుంది. ఇక‌పై మురికివాడల్లోని ప్ర‌తిరోజు 500 మందికి ఈ మొబైల్ క్లినిక్ ద్వారా స‌ర్వీసు అంద‌నుంది.

ఈ మొబైల్‌ క్లినిక్‌లో వైద్యం అందించ‌డానికి కావ‌ల‌సిన అన్ని స‌దుపాయాలు ఏర్పాటు చేస్తారు. అందులో రిసెప్షన్‌ డెస్క్‌తో పాటు డాక్టర్‌ క్యాబిన్‌, లాబోరేటరి, మందుల షాపు ఉంటాయి. తాము స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అందించిన నిధుల విష‌యంలో ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్ అధికారులు మాట్లాడుతూ... తాము ఇప్ప‌టికే పలు పారిశుద్ధ్య, విద్య, వైద్య‌ ప్రాజెక్టుల కోసం స్వచ్ఛంద సంస్థలకు దాదాపు మొత్తం రూ.10.50 కోట్ల  విరాళాలు అందజేశామ‌ని అన్నారు. అలాగే న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News