Faraday Future FF91: భారీ బుకింగ్‌లతో సంచలనం సృష్టిస్తున్న ఫారడే ఫ్యూచర్స్ కారు
ప్రముఖ గ్లోబల్ ఆటోమోటివ్, టెక్ కంపెనీ ఫారడే ఫ్యూచర్స్ తయారు చేసిన 'ఎఫ్‌ఎఫ్91' కార్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 36 గంటల్లోనే 64,000 బుకింగ్‌లు వచ్చాయి. న్యాయపరమైన సమస్యలు, అద్దె సమస్యల కారణంగా సదరు సంస్థ గత కొన్నాళ్లుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సంస్థ ప్రస్తుతం నిధులను సమీకరించలేకపోతే ఇక దానికి భవిష్యత్తు ఉండబోదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్రీ బ్లాకింగ్‌తో పాటు డబ్బులు చెల్లించి కార్లను సొంతం చేసుకోవచ్చనే రెండు ఆఫ్షన్లతో ఆ సంస్థ ఈ కారు బుకింగ్‌లను ప్రారంభించింది.
భారీ స్థాయిలో బుకింగ్స్ వచ్చినప్పటికీ, టెస్లా కంపెనీ కారును మార్కెట్‌లో ఉంచిన మోడల్-3 టార్గెట్‌ను ఇది ఛేదించలేకపోయింది. టెస్లా కేవలం 24 గంటల్లో 2,32,000 బుకింగ్‌లను నమోదు చేసుకుంది. ఫారడే ఫ్యూచర్స్ తయారు చేసిన ఎఫ్‌ఎఫ్ 91 డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతోనే భారీ స్థాయిలో బుకింగ్స్ వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.