kidnap: హైద‌రాబాద్ శివారులో కీచ‌కప‌ర్వం... తొమ్మిదవ త‌ర‌గ‌తి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన యువ‌కులు


హైద‌రాబాద్ శివారులోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఓ బాలికపై ప‌లువురు యువ‌కులు అఘాయిత్యం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల నుంచి ఇంటికి న‌డుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థినిని కారులో వెళుతున్న ప‌లువురు యువ‌కులు గ‌మ‌నించారు. మ‌ద్యం మత్తులో ఉన్న స‌ద‌రు కామాంధులు ఆ బాలిక‌ను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారయ‌త్నం చేశారు. అయితే, విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని స‌ద‌రు యువ‌కుల‌ని చిత‌క్కొట్టారు. అనంత‌రం హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీసులకు వారిని అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల‌ని పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News