shabbir ali: గవర్నర్‌ తన పదవిని పొడిగించుకునేందుకే కేసీఆర్‌ భజన చేస్తున్నారు: షబ్బీర్ అలీ


తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగుడుతూ గవర్నర్ నరసింహన్ నిన్న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని త‌ప్పుబ‌డుతూ కాంగ్రెస్ నేత‌ షబ్బీర్‌ అలీ గవర్నర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గవర్నర్‌ తన పదవిని పొడిగించుకునేందుకే కేసీఆర్‌ భజన చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ స‌ర్కారు ఏర్పడిననాటి నుంచి కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నార‌ని, ఆయ‌న‌లో డైనమిజం ఎక్కడుందో గవర్నరే చెప్పాలని ష‌బ్బీర్ అలీ అన్నారు. టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను తెలంగాణ‌ మంత్రిగా ప్రమాణం చేయించడం ద్వారా నరసింహన్ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా చేశారని ఆయ‌న అన్నారు.

shabbir ali
  • Loading...

More Telugu News