india: అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1992 జనవరి 1న కుదిరిన ఒప్పందం ప్రకారం 26వ సారి ఇరు దేశాలు తమ తమ దేశాల్లో ఉన్న అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఈ రోజు ఇందుకు సంబంధించిన హామీ పత్రాలను భారత్, పాక్ అధికారులు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలలోని అణు సౌకర్యం ఉన్న స్థావరాలపైగానీ, అణ్వాయుధాలపైగానీ దాడులు చేసుకోకూడదు. 1988 డిసెంబర్ 31న ఇరుదేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. అనంతరం జనవరి 27, 1991న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మొదటిసారి ఈ ఒప్పంద పత్రాల మార్పిడి 1992, జనవరి 1న జరిగింది.