kohli: 2016లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా విరాట్ కోహ్లీ


టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఆట‌తీరుతో  2016లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. గ‌త ఏడాది ఆరంభం నుంచే అన్ని ఫార్మాట్ల‌లోనూ చెల‌రేగిపోయిన కోహ్లీ... ఈ ఘ‌న‌త సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కోహ్లీ సాధించిన మొత్తం పరుగులు 2,595. వాటిలో టెస్టుల్లో 1,215 పరుగులు చేశాడు. ఇక వన్డే, టీ ట్వంటీల్లో వ‌రుస‌గా 738, 641 పరుగులు నమోదు చేశాడు. 2016లో కోహ్లీ మూడు డబుల్ సెంచరీలు సాధించి టీమిండియా తరపున ఒక క్యాలెండర్ ఇయర్లో ఈ ఘ‌న‌త సాధించి కెప్టెన్గా, ఆటగాడిగా నిలిచాడు. 2016లో కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 235.

ఇక విరాట్ కోహ్లీ త‌రువాతి స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా వ‌రుస‌గా జో రూట్, స్టీవ్ స్మిత్,  డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఉన్నారు.

జో రూట్(ఇంగ్లండ్) 2016లో చేసిన ప‌రుగుల వివరాలు:
అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి మొత్తం ప‌రుగులు: 2,570  
టెస్టుల్లో చేసిన ప‌రుగులు 1,477
 వన్డేల్లో చేసిన ప‌రుగులు 796
టీ 20ల్లో చేసిన ప‌రుగులు 297
మొత్తం ఆడిన టెస్టులు 17
టెస్టు ఫార్మాట్లో అత్య‌ధిక స్కోరు 254
చేసిన సెంచ‌రీలు: 3
అర్ధ‌శ‌తకాలు:10
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోరూట్ నిలిచాడు.  

 2016లో స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా కెప్టెన్‌) చేసిన  ప‌రుగుల వివ‌రాలు:
అన్ని ఫార్మాట్ల‌లో సాధించిన పరుగులు: 2406
టెస్టుల్లో చేసిన ప‌రుగులు: 1,079
వ‌న్డేల్లో చేసిన ప‌రుగులు: 1154
టీట్వంటీల్లో చేసిన ప‌రుగులు: 173
అత్యధిక వ్యక్తిగత స్కోరు: 165 నాటౌట్.

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) చేసిన ప‌రుగుల వివ‌రాలు:
అన్ని ఫార్మాట్ల‌లో మొత్తం ప‌రుగులు 2,374
టెస్టుల్లో చేసిన ప‌రుగులు: 748
వ‌న్డేల్లో చేసిన ప‌రుగులు: 1,388
టీట్వంటీల్లో చేసిన ప‌రుగులు 238
2016లో వార్నర్ అత్యధిక స్కోరు 173.

కేన్ విలియమ్సన్ చేసిన ప‌రుగుల వివ‌రాలు:
అన్ని ఫార్మాట్ల‌లో మొత్తం ప‌రుగులు: 1,835.
టెస్టుల్లో చేసిన ప‌రుగులు: 753
వ‌న్డేల్లో చేసిన ప‌రుగులు: 699
టీట్వంటీల్లో చేసిన ప‌రుగులు : 383

  • Loading...

More Telugu News