chandrababu: పోలవరం కీలక ఘట్టానికి తొలి అడుగు పడింది.. స్పిల్ వే కాంక్రీటు పనులు ప్రారంభం


పోలవరం కీలక ఘట్టానికి తొలి అడుగు పడింది. స్పిల్ వే కాంక్రీటు పనులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి చేతుల మీదుగా ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమ‌య్యాయి. ప్రాజెక్టు ప్రాంతంలో కొబ్బ‌రికాయ కొట్టి, సిమెంటు వేసి చంద్ర‌బాబు ఈ ప‌నుల‌ను ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డి కార్మికుల‌తో చంద్ర‌బాబు కాసేపు ముచ్చటించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు రాతిమట్టి కట్ట చివర నుంచి స్పిల్ వేను 1054.40 మీటర్ల పొడవున నిర్మిస్తారు. స్పిల్‌వేను 150 అడుగుల ఎత్తుతో నిర్మించ‌నున్నారు. ఈ స్పిల్‌వేకు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంది. 2017 డిసెంబర్‌ నాటికి ఈ ప‌నిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News