cricket: 163 పరుగులకే ఆలౌటైన పాకిస్థాన్‌.. ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం


మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌల‌ర్లు అద్భుతంగా రాణించ‌డంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా వి‌ఫ‌లమ‌య్యారు. రెండో ఇన్నింగ్స్‌లో 163 ప‌రుగుల‌కే పాక్ బ్యాట్స్ మెన్ ఆలౌట్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 ప‌రుగుల‌ తేడాతో విజ‌యఢంకా మోగించింది.

మొద‌టి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన‌ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 624 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం రాణించ‌లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ భావించిన సమయంలో, ఎవరూ ఊహించని విధంగా పాక్ రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేయడం ఆస్ట్రేలియాకు విజయాన్ని తెచ్చిపెట్టింది.   

  • Loading...

More Telugu News