chandrababu: ఒకే రోజు ఆరు ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం చాలా సంతోషంగా ఉంది: చ‌ంద్ర‌బాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ రోజు ప‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఢిల్లీ నుంచి రిమోట్‌తో ప‌లు రైల్వే ప‌నుల‌ను ప్రారంభించారు. విశాఖ-తిరుప‌తి డబుల్ డెక్క‌ర్  రైలు ప్రారంభం అవ‌డంతో పాటు గుంటూరు రైల్వే స్టేష‌న్‌లో హై స్పీడ్ వైఫై సేవ‌లు ప్రారంభమ‌య్యాయి. న‌డికుడి-శ్రీ‌కాళ‌హ‌స్తి రైల్వే ప్రాజెక్టు ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌రిగింది. విజ‌య‌వాడ‌లోని స‌త్య‌నారాయ‌ణపురంలో ఈటీటీసీ ట్రైనింగ్ సెంట‌ర్ ప్రారంభమైంది.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ఒకేరోజు ఆరు ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నేడు పోల‌వ‌రం కాంక్రీట్ ప‌నుల‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో ఆధునిక ప‌ద్ధ‌తిలో రూట్ రిలే ఇంట‌ర్ లాకింగ్ వ్య‌వ‌స్థను తీసుకొచ్చారని చెప్పారు. తిరుప‌తి-విశాఖ ఏసీ డ‌బుల్ డెక్క‌ర్ ఎక్స్‌ప్రెస్‌తో రాష్ట్రంలో 9 జిల్లాల‌కు క‌నెక్టివిటీ వ‌స్తుంద‌ని అన్నారు. సురేష్ ప్ర‌భు రాష్ట్రానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అన్ని విధాలుగా సాయం చేస్తున్నారని చంద్ర‌బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News