obama: ఫోన్‌లో మాట్లాడుకున్న ఒబామా- ట్రంప్‌.. ప‌ర‌స్ప‌రం టచ్‌లో ఉండాలని నిర్ణయం


ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన‌ ఇజ్రాయిల్‌పై తీర్మానం సహా పలు అంశాలపై త‌లెత్తిన‌ విభేదాలపై ప‌రిష్కార‌మే లక్ష్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఫోన్‌లో మాట్లాడారు. దీని ఫలితంగా ఇరువురు నేత‌లు ఒక అవగాహనకు వచ్చార‌ని, వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌ పూర్తి సానుకూల వాతావరణంలో జ‌రిగింద‌ని శ్వేత‌సౌధం తెలిపింది. అధికార బదాలాయింపులో భాగంగా పలు అంశాలపై సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు మరికొన్ని వారాలు పరస్పరం టచ్‌లో ఉండాలని ఒబామా-ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

తాను ఒబామాతో మాట్లాడిన అంశంపై  ట్రంప్‌ ఫ్లోరెడాలో మాట్లాడుతూ... ఒబామాతో ఓ చక్కటి స‌మావేశం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో జ‌రిగే ఓటింగ్‌లో త‌మ‌దేశం పాల్గొన‌కూడ‌ద‌ని అమెరికా తీసుకున్న నిర్ణ‌యంపై ట్రంప్ ఇటీవ‌లే మండిప‌డ్డారు. ఈ నేపథ్యంలోనే ఒబామా సర్కారు చొర‌వ తీసుకొని ట్రంప్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.

  • Loading...

More Telugu News