demonitisation: డిసెంబర్ 30 తరువాత కూడా బ్యాంకుల్లో విత్ డ్రా పరిమితుల ఎత్తివేతకు నో ఛాన్స్
పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు కొరత ఏర్పడడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో నగదు ఉపసంహరణపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 తర్వాత ఆ పరిమితులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందని అందరూ భావించారు. అయితే, ఈ నెల 30 తర్వాత కూడా ఆ పరిమితులను కొనసాగించాలని బ్యాంకులు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదనను పంపాయి. బ్యాంకులకు కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందిన తరువాతే పరిమితులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో తీవ్ర కసరత్తే చేస్తోంది.