obama: రష్యాపై ఆంక్షలు విధించనున్న అమెరికా.. ట్రంప్ కూడా ఉపసంహరించలేని విధంగా చర్యలు


ఇటీవ‌లే జ‌రిగిన త‌మ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రష్యా జోక్యం చేసుకున్నందుకు గానూ అగ్ర‌రాజ్యం అమెరికా ఆగ్ర‌హంతో ఉంది. ఇందుకు గానూ ర‌ష్యాపై ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ర‌ష్యా సైబర్‌ ఆపరేషన్స్‌లో జోక్యం చేసుకోవడం, కోవర్ట్‌ ఆపరేషన్‌ వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఒబామా ప్ర‌భుత్వం భావిస్తోంది. రష్యాపై తీసుకోనున్న చ‌ర్య‌ల‌పై అమెరికా కొన్ని రోజుల్లో వివ‌రాలు తెలిపే అవ‌కాశం ఉంది. విదేశీ హ్యాకర్లు త‌మ దేశ‌ ఆర్థిక, భద్రతాంశాల్లోకి ప్ర‌వేశిస్తే వాటిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారానికి సంబంధించిన చట్టాన్ని 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చింది.

అయితే, రష్యన్‌ హ్యాకర్లను శిక్షించడం క‌ష్ట‌త‌ర‌మ‌యిన ప‌ని అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ర‌ష్యా హ్యాక‌ర్లు చేసిన ఈ చ‌ర్య‌పై రష్యాకు త‌మ ప్రతిస్పందన ఎలాగుంటుందో తెలియజేయాలని అమెరికా యోచిస్తోంది. రష్యా హ్యాకర్లను శిక్షించి త‌మ‌దేశ‌ ఎన్నికల వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుందో తెలియ‌జేయాల‌ని ఒబామా భావిస్తున్నారు. రష్యాపై తీసుకోనున్న ఈ చర్యలను అమెరికా కొత్త‌ అధ్యక్షుడు ట్రంప్ కూడా భ‌విష్య‌త్తులో ఉపసంహరించలేని విధంగా తీసుకోవాల‌ని అమెరికా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News