uppuleti kalpana: ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు తృటిలో తప్పిన ప్రమాదం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-77db4ac54416fdf4ea1771deecc5b5e703b51a61.jpg)
ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఈ రోజు ప్రమాదం తప్పింది. ఆమె ఈ రోజు కారులో విజయవాడకు వెళుతున్న సమయంలో యనమలకుదురు వద్దకు రాగానే ఆమె కారు టైరు పేలింది. ఆమె ప్రయాణిస్తోన్న కారుకు ఒక స్కూటీ అడ్డురావడంతో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు టైరు పేలడంతో ఉప్పులేటి కల్పన మరో కారులో విజయవాడకు వెళ్లారు.