srilanka ex pm passes away: శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే మృతి


అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే(83) ఈ రోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. 2005 నుంచి 2010 మ‌ధ్య కాలంలో శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహీంద్ర రాజపక్సే హయాంలో ఆయ‌న‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీలో రత్నసిరి విక్రమనాయకే 60 ఏళ్లకుపైగా సభ్యుడిగా ఉండి సేవ‌లందించారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

srilanka ex pm passes away
  • Loading...

More Telugu News