police complint: ఇంట్లో భ‌ర్త‌ విచిత్ర ప్రవర్తన... పోలీసులకి ఫిర్యాదు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని!


ఇంట్లో తన భర్త విచిత్రంగా ప్ర‌వర్తిస్తున్నాడ‌ని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని (29) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. త‌న భ‌ర్త‌తో త‌న‌కు గ‌త ఏడాది బెంగళూరులో పెళ్లి జ‌రిగింద‌ని, తాము ఇందిరానగర్‌లో ఉంటున్న‌ట్లు తెలిపిన ఆ మ‌హిళ త‌న భర్త ఇంట్లో ఆడ‌వాళ్ల‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, ఇక ఆయ‌న‌తో ఉండ‌బోన‌ని ఫిర్యాదు చేసింది.

త‌న భ‌ర్త‌ పగలు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి త‌న‌లా మేకప్‌ వేసుకుంటాడని ఆమె చెప్పింది. చీర మాత్రమే ధరిస్తూ మహిళలా ప్రవర్తిస్తాడని పేర్కొంది. త‌మ పెళ్లి జ‌రిగి ఏడాది గ‌డిచింద‌ని, అయినప్ప‌టికీ తామింకా దగ్గర కాలేదని, త‌న భ‌ర్త ఓ నపుంసకుడని చెప్పింది. త‌న‌కు వివాహం జ‌రిగినప్ప‌టి నుంచి త‌న భ‌ర్త తీరు ఇంతేన‌ని చెప్పింది. ఇంట్లో ఆయన వైఖరిని భరించలేకపోతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, భార్య నుంచి విడిపోయేందుకు ఒప్పుకుంటున్న‌ట్లు ఆమె భర్త కూడా పోలీసులకు చెప్పడం కొసమెరుపు! 

  • Loading...

More Telugu News