demonitisation: సిండికేట్‌ బ్యాంకులో సోదాలు చేస్తోన్న ఆర్‌బీఐ విజిలెన్స్‌ విభాగం అధికారులు


పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టి దాడులు జ‌రుపుతున్నార‌ని తెలిసిన‌ప్ప‌టికీ కూడా క‌మీష‌న్‌ల క‌క్కుర్తితో బ్యాంకు అధికారులు చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తిలోని సిండికేట్‌ బ్యాంక్‌లో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకున్న‌ ఆర్‌బీఐ విజిలెన్స్‌ విభాగం అధికారులు ఈ రోజు ఆ బ్యాంకుపై దాడి చేశారు. ఈ బ్యాంక్‌పై ఇటీవ‌లే ప‌లు ఆరోపణలు వ‌చ్చాయి. బ్యాంకులో జరిగిన పలు కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను ఈ త‌నిఖీల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్య‌వ‌హారంపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News