income tax: యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు ఇతరులకు చెప్పొద్దు.. ప్రమాదం!: ఆదాయపన్ను శాఖ అధికారుల హెచ్చరిక
అనధికార వ్యక్తుల చేతుల్లోకి పన్ను చెల్లింపుదారుల వివరాలు వెళ్లకుండా ఉండేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఇతరులకు చెప్పకూడదని గట్టిగా హెచ్చరించారు. వాటిని ఇతరులకు తెలిపితే టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు పన్ను చెల్లింపుదారుల పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురయినప్పటికీ వారి సమాచారం భద్రత ఉల్లంఘన జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇతరులకు ఆ విషయాలు తెలిస్తే పలు మస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు తమ పాస్‌వర్డులను కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా సెట్ చేసుకోవాలని, అందులో పలు నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండేలా పెట్టుకోవాలని చెప్పారు.
తాము పెట్టుకున్న పాస్‌వర్డ్‌లను కంప్యూటర్ డెస్క్పై, వైట్బోర్డుల వంటి చోట్ల రాయకూడని ఆదాయపన్ను శాఖ అధికారులు సూచించారు. వాటితో పాటు కంప్యూటర్ డెస్క్ లపై ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లను పెట్టుకోవడం కూడా మంచిది కాదని, హ్యాకర్లు యూజర్ల ఈ-మెయిల్, కంప్యూటర్‌పై దాడి చేస్తే మీ అకౌంట్ వివరాలను తస్కరిస్తారని, యూజర్ల ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా వారి క్రెడిట్/డెబిట్ కార్డుల సమాచారం వారికి తెలిసిపోతుందని చెప్పారు. దీని ద్వారా మీ వివరాలు దుర్వినియోగం చెందుతాయని తెలిపారు.