demonitisation: బ్యాంక్ ఆఫ్ అమెరికా సహా 5 బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అన్ని లావాదేవీలపై నిఘా ఉంచిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు బ్యాంకులకు ఈ రోజు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. సదరు బ్యాంకులు ఫారన్ మేనేజ్ మెంట్ ఎక్స్ఛేంజ్ యాక్ట్- 1999(ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు చెప్పింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యో మిస్టుబిషి, డచ్చీ బ్యాంక్, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్‌లకు ఈ జరినామా విధిస్తున్నట్లు పేర్కొంది.