demonitisation: తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు బంధువుల ఇళ్లలో భారీగా నగదు, బంగారం స్వాధీనం.. ఏ క్షణంలోనైనా సీఎస్ ను అరెస్ట్ చేసే అవకాశం?
ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోన్న ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రామ్మోహన్ రావుని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరులో రామ్మోహన్‌రావు వియ్యంకుడి ఇంటితో పాటు, బెంగళూరు, చెన్నయ్‌లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 200 కిలోల బంగారాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక, మరో 100 కోట్ల నగదు కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ కేసులో రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుమారుడిని కూడా అధికారులు రేపు అరెస్టు చేసే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.