karunandhi: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో టీవీ చూస్తున్న కరుణానిధి ఫొటో విడుదల


అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 15వ తేదీన మ‌రోసారి కావేరీ ఆసుప‌త్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధి కోలుకున్నారని ఆ ఆసుప‌త్రి వైద్యులు పేర్కొన్నారు. ఆయ‌న‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుద‌ల చేశారు. ఆ ఫొటోలో ఆయన ఆసుపత్రిలో టీవీ చూస్తూ కనిపిస్తున్నారు. ఆసుప‌త్రిలో క‌రుణానిధికి యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తయిన అనంత‌రం ఆయనను డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. కాగా, త‌న తండ్రి కరుణానిధి రేపు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని రాజ్యసభ స‌భ్యురాలు కనిమొళి తెలిపారు. త‌న‌ తండ్రికి ట్రాకొస్టమీ జరిగినందువల్ల ఆయ‌న ప్రస్తుతం మాట్లాడలేరని చెప్పారు. ఇది మిన‌హా క‌రుణానిధి ఆరోగ్యం అంతా బాగానే ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News