demonitisation: అప్పుడు చాయ్‌వాలా.. ఇప్పుడు పేటీఎం వాలా!: మోదీపై మ‌మ‌తా బెన‌ర్జీ విమ‌ర్శ‌లు


పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌స్తోన్న ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ రోజు మరోసారి ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీపై మండిప‌డ్డారు. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న క‌ష్టాలను మోదీ పట్టించుకోవ‌ట్లేద‌ని ఆమె అన్నారు. అప్ప‌ట్లో ‘ఛాయ్‌వాలా’గా ఉన్న ఆయ‌న ఇప్పుడు ‘పేటీఎం వాలా’ అయిపోయార‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆమె వెనిజులాలో పెద్ద నోట్ల ర‌ద్దు అంశాన్ని వాయిదా వేసిన అంశాన్ని ప్ర‌స్తావించారు.
ప్రజలు ఎదుర్కుంటున్న క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ ప్ర‌భుత్వం నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంద‌ని అన్నారు.

మ‌న దేశంలో మాత్రం  ప్రభుత్వం ఇబ్బందులను లెక్క చేయ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మమతా బెనర్జీ అన్నారు. ప్ర‌జ‌లు ఏ మొబైల్‌ ఫోన్ కొనుక్కోవాలో, వాటిల్లో ఏ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఎక్కడ న‌గ‌దును జ‌మ చేసుకోవాలో చెబుతూ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ని శాసించ‌లేద‌ని ఆమె ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News