america: ఒకదానికొకటి ఢీ కొన్న 55 వాహనాలు... 5 గంటల పాటు నిలిచిన రాకపోకలు
శీతాకాలం నేపథ్యంలో అమెరికాలో కురుస్తోన్న మంచు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. విపరీతంగా కురుస్తోన్న మంచుతో అక్కడి రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాలు ఒకదానినొకటి ఢీకొంటున్నాయి. తాజాగా బాల్టీమోర్ హైవేపై వెళుతున్న వాహనాల్లో 55 వాహనాలు ఒకదానినొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. దీంతో ఆ హైవేపై 5 గంటల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానట్లు తెలుస్తోంది. మరోవైపు విపరీతమైన మంచు కారణంగా ఆ దేశంలోని వర్జీనియా, మేరీల్యాండ్, ఒక్లహామా రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. బాల్టిమోర్ ప్రాంతం గుండా వెళుతున్న ఓ ఇంధన ట్యాంకర్ రహదారిపై బోల్తా పడడడంతో అందులో మంటలు వ్యాపించాయి.