demonitization: బ్లాక్ మనీపై ఈసీ తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం: ప్రధాని మోదీ
బ్లాక్ మనీపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలకు వస్తోన్న విరాళాల విషయంలో పారదర్శకతను పాటించాల్సి ఉందని, ఈసీ సూచించిన అంశాలను ప్రతి రాజకీయ పార్టీ ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ రోజు నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మోదీ మాట్లాడారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలపై ఆయన స్పందిస్తూ... తాము దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు
చర్యలు తీసుకుంటుంటే పార్లమెంటులో విపక్షాలు మాత్రం చర్చ జరగకుండా అడ్డుకున్నాయని అన్నారు. దేశంలోని అవినీతిపై జరగాల్సిన చర్చ నుంచి విపక్ష సభ్యులు పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను అవినీతి పట్టిపీడిస్తోందని ఆయన అన్నారు.