demonitization: దారి మ‌ళ్లుతున్న కొత్తనోట్లు.. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రూ.17 లక్షల విలువైన‌ కొత్తనోట్లు స్వాధీనం


పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో న‌ల్ల‌కుబేరులు త‌మ డబ్బుని మార్చుకునేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. డ‌బ్బుని ఒక‌చోటు నుంచి మ‌రొక చోటుకి త‌మ వాహ‌నాల ద్వారా త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో రైళ్ల ద్వారా త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుపుతున్నారు. ఓ వైపు ఖాతాదారులు బ్యాంకుల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్లో నిల‌బ‌డినా ప‌ది వేల రూపాయ‌ల‌యినా దొర‌క‌డం లేదు. మ‌రోవైపు న‌ల్ల‌కుబేరుల చేతిలోకి మాత్రం ల‌క్ష‌ల కొద్దీ రూపాయ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి ఏకంగా రూ.17 లక్షల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం మిర్చియార్డులో గుమస్తాలుగా పనిచేస్తోన్న‌ ఉపేందర్‌, మురళీకృష్ణ  బరంపురం నుంచి ఈ నోట్లు తీసుకొచ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు.

  • Loading...

More Telugu News