pawan kalyan: సారీ.. అది తప్పుగా పడింది: పవన్ కల్యాణ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c9aa0091224de41f910bec6a44b94b5568c3f686.jpeg)
భారతీయ జనతా పార్టీని నిలదీస్తూ ఈ రోజు జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ తన మూడవ అంశం గురించి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నిజమైన దేశభక్తి అంటే ఏంటో బీజేపీకి చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన ‘జేఎన్‌టీయూలో విద్యార్థులపై దేశ ద్రోహం పెట్టారు, కానీ, వారు దేశ ద్రోహానికి పాల్పడలేదు.. తరువాత ఆ విషయం రుజువైంది’ అని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికే ఆయన మళ్లీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఫాలోవర్లకు సారీ చెప్పారు. తాను తన ట్వీట్‌లో జేఎన్‌టీయూ అని పేర్కొన్నానని, దాన్ని సరిచేస్తున్నానని అది ‘జేఎన్‌టీయూ కాదు- ఢిల్లీలోని జేఎన్‌యూ’ అని పేర్కొన్నారు. రేపు తాను ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోస్ట్ చేస్తానని చెప్పారు. ఆఖరికి జై హింద్ అని పేర్కొన్నారు.