demonitization: స్వచ్ఛందంగా ఆస్తుల ప్రకటనకు మరో అవకాశం.. పట్టుబడితే కనుక తీవ్ర చర్యలు!: కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం నిర్వహిస్తోన్న సోదాల్లో నల్ల కుబేరుల వద్ద భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ రోజు సర్కారు మరో ప్రకటన చేసింది. ఐడీఎస్ పథకాన్ని మరోసారి తీసుకొచ్చింది. రేపటి నుంచి ఈ నెల 31 లోపు ఆస్తుల వివరాలు వెల్లడించాలని పేర్కొంది. తాము ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఆస్తులు ప్రకటించకుండా ఉండి, తాము జరుపుతున్న దాడుల్లో పట్టుబడితే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
వివరాలు వెల్లడించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పింది. అలాగే రేపటి నుంచి 'గరీబ్ కల్యాణ్ యోజన' పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు, ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నట్టు కేంద్రం పేర్కొంది. దేశ వ్యాప్తంగా జరుపుతున్న లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు నిఘా ఉంచారని తెలిపింది.