demonitization: పెద్ద నోట్ల రద్దు పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు


పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై సుప్రీంకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్లు ఈ రోజు విచార‌ణకు వ‌చ్చాయి. స‌ద‌రు పిటిష‌న్లన్నింటినీ ఐదుగురు స‌భ్యులతో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాసనానికి బ‌దిలీ చేసింది. ర‌ద్ద‌యిన‌ క‌రెన్సీ నోట్లను రైల్వేస్టేష‌న్లు, ఎయిర్‌పోర్టులు, ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఉప‌యోగించుకునే వెసులుబాటుపై పూర్తి నిర్ణ‌యం తీసుకోవాల్సింది కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని వ్యాఖ్యానించింది. రూ.500, రూ.1000 పాతనోట్ల‌తో చెల్లింపుల గ‌డువును పెంచే విధంగా తాము ఆదేశాలు జారీ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. పెద్ద నోట్లతో చెల్లింపుల వెసులుబాటు గ‌డువుని పెంచాల‌ని వ‌చ్చిన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. వారానికి రూ.24 వేలను తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం ఆ హామీని పూర్తిస్థాయిలో అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. మరోపక్క, పెద్ద‌నోట్ల‌ ర‌ద్దు నిర్ణయంపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టులలో దాఖలైన పిటిషన్లపై స్టే విధించింది.

  • Loading...

More Telugu News