supreme court: ల‌క్ష‌ల కొద్దీ కొత్త నోట్లు న‌ల్ల‌కుబేరుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయి?: పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం


పెద్ద‌నోట్ల ర‌ద్దు తదనంతరం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సుప్రీంకోర్టు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై వేసిన పిటిష‌న్ల‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు అవ‌స్థలు ప‌డుతున్నారని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండ‌గా, న‌ల్ల‌కుబేరుల చేతుల్లోకి ల‌క్ష‌ల కొద్దీ కొత్త నోట్లు ఎలా వెళుతున్నాయ‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌స్తుతం దేశంలో రెండు ర‌కాల ప్ర‌జ‌లు ఉన్నార‌ని, క‌ట్ట‌ల కొద్దీ కొత్త‌నోట్లు ఉన్నావారు ఒక‌రైతే, చేతిలో న‌యా పైసా లేకుండా అవ‌స్థ‌లు ప‌డుతున్న వారు మ‌రొక‌ర‌ని వ్యాఖ్యానించింది. బ్యాంకు అధికారులు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

  • Loading...

More Telugu News